లావణ్య త్రిపాఠి.. ఈ అందాల రాక్షసి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నవ్వుతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడ్డేసింది. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికి పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే నాని మారుతి కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా మాత్రం ఈ అమ్మడుకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనతో అందరిని మెప్పించింది.
లావణ్య త్రిపాఠి తెరపై ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అందాల ఆరబోతకు అమ్మడు ఆమడ దూరంలో ఉంటారు. అయితే ఈ మధ్య ఈ బ్యూటీ గేర్ మార్చినట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు తెర మీదా తెర వెనుకా నిండైన దుస్తులతోనే చక్కాగా కనిపించే ఈ వయ్యారి సోషల్ మీడియాలో మాత్రం హద్దులు దాట్టేస్తుంది. లావణ్య పొట్టి దుస్తుల్లో కనిపించి ఒక్కసారిగా తన అభిమానులకు షాకిచ్చారు.
మొన్న వచ్చిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో మొదటిసారిగా లావణ్య త్రిపాఠి లిప్ లాక్కు యస్ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అలా లావణ్య త్రిపాఠి తన రూల్స్‌ను తానే మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అయితే సోషల్ మీడీయాలో బాగా యక్టివ్ గా ఉండే ఈ చిన్నది.. తన అభిమానులకు తాజా అప్డేట్స్ ఇస్తూ చలాకిగా ఉంటుంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ అమ్మడు టాలీవుడ్ బడా ఫ్యామిలీ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందట. అంతేకాదు.. వీళ్ళ లవ్ విషయం ఇంట్లో కూడా చెప్పేసారట. వీళ్ళ పెద్దలు కూడా ఓకే చెప్పడంతో.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు.. టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త బయటకి రావడంతో.. లావణ్య కి కాబోయే భర్త ఎవరు అని .. టాలీవుడ్ లో అ బడా ఫ్యామిలీ ఎవరబ్బా అని ఆలోచనలో పడ్డారట అమ్మడు ఫ్యాన్స్ ..?