శ్రీశైల శ్రీ రాజమౌళి.. తెలుగునాట లబ్ధ ప్రతిష్టులైన దర్శకుడు. వందకు వందశాతం విజయాల దర్శకుడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక్క వైఫల్యం అందుకోకుండా అంకిత భావంతో సినిమాలు చెక్కిన జక్కన్న. అవధుల్లేని బడ్జెట్… అయినా, ఆయనపై నిర్మాతలకు అంతులేని విశ్వాసం. ఆయన సినిమాల్లో నటించాలని వేవేల కలలు కనే నటీనటులకు కొదవే లేదు. ఎంత చిన్న పాత్ర అయినా సరే.. ఆయన సినిమాల్లో చోటు కోసం ఆరాటపడే ఔత్సాహికులు మరెందరో? అంతటి సంచలన విజయాలు దక్కించుకున్న శ్రీశైల శ్రీ రాజమౌళి మరెవరో కాదు… ఆయనే ఎస్.ఎస్.రాజమౌళి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడాయన. ఈ ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా రాజమౌళి పేరు చర్చనీయాంశం అయిపోయింది. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నదే. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. ఆయన దర్శకుడిగా మారిన 2001 సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు మొత్తం 12 చిత్రాలకి దర్శకత్వం వహించడం జరిగింది.
రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని భావించే నటీనటులు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒక డైరెక్టర్ మాత్రం తాను రాజమౌళిని పొట్టోడు అని పిలిచేవాడని రాజమౌళి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. రాజమౌళి రాఘవేంద్రరావు కంటే ముందు క్రాంతి కుమార్ అనే డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
అయితే క్రాంతి కుమార్ దగ్గర రాజమౌళితో పాటు దిక్కులు చూడకు రామయ్య సినిమాకు దర్శకత్వం వహించిన త్రికోటి కూడా పని చేశారు. ఇక ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్న రాజమౌళి.. తనకు త్రికోటికి మధ్యనున్న అనుబంధం గురించి చెప్పాడు. తమిళ క్రాంతి కుమార్ దగ్గర ట్రైనింగ్ చేస్తున్న సమయంలో వీరిద్దరు కలిసి సినిమాలకు తిరిగేవారని.. అలా సినిమాలు చూసి ఇంటికి వచ్చేటప్పుడు జారిపోతున్న పాంట్ ను పైకి లాక్కుంటూ తనను ఏ పొట్టోడా అంటూ పిలిచేవాడట త్రికోటి. రాజమౌళి దర్శకుడిగా మారిన తర్వాత త్రికోటిని అసిస్టెంట్ గా చేర్చుకున్నారు. ప్రస్తుతం రాజమౌళిని సార్ అని పిలిచే త్రికోటి ఎవరూ లేకపోతే మాత్రం రాజమౌళిని మౌళి అని పిలుస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం త్రికోటి రాజమౌళి దగ్గర పని చేస్తున్నారు.