వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి. కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. అంతేకాదు వరుసగా ఆఫర్లను కొట్టేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మూడు చిత్రాల్లో నటిస్తోంది.
ఇక ఈ సినిమాలో కృతికి తల్లిగా చేసింది గాయత్రి జయరామన్. గాయత్రి జయరామన్ అనే పేరు సినీ ఇండస్ట్రీ వాళ్లకు తప్ప తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ.. ‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి తల్లి పాత్రలో నటించిన వ్యక్తి ఆమేనంటే టక్కున గుర్తొచ్చే ముఖం ఆమెదే. ఈ సినిమా తో ఆమె గట్టి కమ్ బ్యాక్ నే ఇచ్చారు. కమ్ బ్యాక్ ఏంటా..? అని అనుకుంటున్నారా..? బేబమ్మ మదర్ గాయత్రీ గతం లో కూడా సినిమాల్లో నటించారు. ఆమె టాలీవుడ్ హీరో శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా కూడా చేసారు.
2001లో ‘నీలా’ అనే కన్నడ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఉప్పెన కంటే ముందు కూడా రెండు తెలుగు సినిమాలు చేశారు. 2002లో విడుదలైన ‘ఆడుతూపాడుతూ’ సినిమాలో శ్రీకాంత్ సరసన హీరోయిన్గా నటించింది మరెవరో కాదు. గాయత్రి జయరామనే.
ఆ తర్వాత 2005లో నాయుడు ఎల్.ఎల్.బి అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలు ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. సినిమాలకు గ్యాప్ రావడం తో.. ఆమె 2007 లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసారు. కానీ.. ‘ఉప్పెన’ సినిమాతో మరొక్కసారి టాలీవుడ్‌ను పలకరించింది.
ఇన్‌స్టాగ్రాంలో దాదాపు 70 వేల మందికి పైగా గాయత్రి జయరామన్‌కు ఫాలోవర్లుగా ఉన్నారు. మోడ్రన్ లుక్‌లో ఉన్న కొన్ని ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఆ ఫొటోలను చూస్తే ‘ఉప్పెన’లో హీరోయిన్‌కు తల్లిగా చేసిన ఈమె ఆమె ఒకరేనా అనే సందేహం కలగక మానదు.