సుమంత్ అశ్విన్ .. సినీ నిర్మాత దర్శకుడు ఎమ్మెస్ రాజు కొడుకు. అయితే తన తండ్రి దర్శకత్వంలోనే తన మొదటి సినిమాతో 2012 లో”తూనీగ తూనీగ” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు. తూనీగ తూనీగ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ అశ్విన్.. టాలీవుడ్‌లో బాగానే పేరు తెచ్చుకున్నాడు.
తూనీగ తూనీగ’ అనే సినిమాతో అప్పుడెప్పుడో హీరోగా పరిచయం అయిన సుమంత్ అశ్విన్.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయాడు. కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, ప్రేమకథ చిత్రం 2, హ్యాపీ వెడ్డింగ్ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌లో హీరోగా నటించిన ఆయన ఇక తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుంటూ నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు.
ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన ఆయన సుమంత్ అశ్విన్ భార్య పేరు దీపిక. దీపిక.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారు. ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే డెల్హౌస్ లో స్థిరపడ్డారు. ఈమె ఒక సైంటిస్ట్ గా కూడా పని చేస్తోంది.
కరోనా నేపథ్యంలో, వివాహం కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో మాత్రమే జరిగింది. ఓ సందర్భంలో కోడలికి సంబంధించిన వివరాలను ఎం.ఎస్. రాజు స్వయంగా తెలిపారు. తనకు కోడలి పేరు దీపిక అని .. ఆమె లాంటి మంచి అమ్మాయి తమ ఇంటికి కోడలిగా రావడం ఆనందంగా ఉందని చెప్పారు.