Moviesఅమీర్‌ఖాన్ - కిర‌ణ్‌రావు విడాకుల‌కు కార‌ణం ఇదే...!

అమీర్‌ఖాన్ – కిర‌ణ్‌రావు విడాకుల‌కు కార‌ణం ఇదే…!

బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ – కిర‌ణ్ రావు దంప‌తులు 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అమీర్ ఖాన్ దాంప‌త్య జీవితానికి ఎంతో విలువ ఇస్తార‌న్న అభిప్రాయం అంద‌రికి ఉండేది. అలాంటిది ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక కూడా అమీర్ త‌న మొద‌టి భార్య రీనాకు విడాకులు ఇచ్చారు. వీరి విడాకులు అప్ప‌ట్లోనే చాలా మందికి న‌చ్చ‌లేదు. ఆ త‌ర్వాత అమీర్ కిర‌ణ్ రావుతో ప్రేమ‌లో ప‌డి పెళ్లాడాడు. కిర‌ణ్ రావు అమీర్ మ‌ధ్య ల‌గాన్ సినిమా టైంలో ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారి వారు పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది.

ఇక ఇప్పుడు ఈ దంప‌తులు పెద్ద సంచ‌ల‌న వార్త చెప్పారు. అమీర్ ఖాన్ – కిరణ్ రావు సంయుక్త ప్రకటనలో 15 సంవత్సరాల వివాహం తర్వాత విడాకులు తీసుకునట్లు ప్రకటించారు. మేము మా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము – ఇకపై భార్యాభర్తలుగా కాదు, సహ తల్లిదండ్రులుగా మరియు కుటుంబంగా ఉంటాము అని ప్రకటించారు. మీరు ఈ విడాకులను ముగింపుగా కాకుండా కొత్త ప్రయాణానికి ఆరంభంగా చూస్తారని అనుకుంటున్న‌ట్టు కూడా వారు చెప్పారు.

ఇక వీరిద్ద‌రు సంతకం చేసిన ప్రకటన మీడియాకి రిలీజ్ చేశారు. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ తో పాటు వ్య‌క్తిగ‌త జీవితంలో మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డం లాంటి కార‌ణాలే పెద్ద‌వి అయ్యి వీరు విడిపోవ‌డానికి కార‌ణ‌మైన‌ట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news