టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ రేంజ్, క్రేజ్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఉంది. బాహుబలి 1, 2 సినిమాల తర్వాత సాహో సినిమాతో ప్రభాస్ నేషనల్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నాయి అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే . మనోడు బాలీవుడ్ స్టార్ హీరోలకే చెమటలు పట్టిస్తున్నాడు. మహానటి ఫేం నాగ్ అశ్విన్‌తో ఓ క్రేజీ ప్రాజెక్టుతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. సౌత్‌లో అన్ని భాషలతో పాటు అటు బాలీవుడ్‌లోనూ ఈ సినిమానూ రూపొందిస్తున్నారు.
ఈ సినిమా కోసం ప్రభాస్‌కు రు. 50 కోట్ల రెమ్యునరేషన్ అంటున్నా… ప్రి రిలీజ్ బిజినెస్ బాగా జరిగితే మరో రు. 20 కోట్లు ఇస్తామని కూడా నిర్మాతలు ఒప్పందం చేసుకుంటున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ , హెయిర్ స్టైల్ కోసం బాలీవుడ్ హెయిర్ స్టైలీష్లు పని చేస్తున్నారట. బాలీవుడ్లోనే ఎంతో పేరున్న ప్రముఖ హెయిర్ స్టైలీస్ట్ అయిన హకీమ్ ప్రభాస్ సాహోకు పని చేశాడు. ఇప్పుడు అదే హకీమ్ సలార్ కోసం కూడా పని చేస్తున్నాడట.
ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రభాస్‌కు ఒక్కసారి హెయిర్ కట్ చేసేందుకు హకీమ్ రు. 2- 3 లక్షల వరకు ఛార్జ్ చేస్తాడట. ఇందుకు అతడికి రాను పోనూ ఖర్చులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ ఎన్ని సార్లు జరిగినా.. ఎన్నిసార్లు హెయిర్ స్టైల్ మార్చాలన్నా కూడా హకీమ్ చూసుకుంటాడట. ప్రభాస్ సరసన శృతీహాసన్ నటిస్తోన్న ఈ సినిమాకు చాలా వరకు కేజీఎఫ్ టీం పని చేస్తోంది.