Gossipsఅఖండ‌లో ప‌వ‌న్ ఐటెం భామ చిందులు..!

అఖండ‌లో ప‌వ‌న్ ఐటెం భామ చిందులు..!

దర్శకుడు బోయపాటి శ్రీను, స్టార్ హీరో బాలయ్య ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కాంబోలో సినిమా వస్తే అది బ్లాక్ బస్టర్ నే. దర్శకుడు బోయపాటి శ్రీను, స్టార్ హీరో బాలయ్య కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం”అఖండ”. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవగా, ఇప్పుడు ఈ సినిమాపై అంతకు మించిన భారీ అంచనాలు ఉన్నాయి.

బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని సమాచారం అందుతోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఈ సినిమాలో హీరో బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా అఘోర పాత్రలో నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ అఖండ మూవీకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

థమన్ ఈ సినిమా కోసం అదిరిపోయే సాంగ్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. స్టార్ హీరో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్, టీజర్ లు ప్రేక్షకులను ఆకట్టుకుని అంచనాలను మరింత పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆశ్కతికర అప్డేట్ బయటకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రాయ్ లక్ష్మీ రీఎంట్రీ ఉండబోతోందన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమాలో బోయపాటి శ్రీను స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారని.. అందులో ఇప్పటికే ఎన్నో ఐటం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేసిన ప్రముఖ నటి లక్ష్మీ రాయ్ ఈ సాంగ్ చేయనున్నారని తెలుస్తోంది. బాలయ్య హీరోగా కొన్నేళ్ల క్రితం రిలీజైన అధినాయకుడు సినిమాలో రాయ్ లక్ష్మీ బాలయ్యకు జోడీగా నటించారు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ ఐటం సాంగ్స్ చేసింది లక్ష్మీ రాయ్. ఇప్పటికే బలుపు, సర్ధార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150లో ఐటం సాంగ్స్ చేసిన రాయ్ లక్ష్మీ బాలయ్య మూవీతో కెరీర్ మళ్ళీ ఉపందుకుంటుందా లేదా అన్నది ఆమె పెర్ఫార్మన్స్ పై ఆధారపడి ఉంటుంది. “అఖండ” తో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news