Moviesఎన్టీఆర్ హీరోయిన్ అద్భుతమైన చిట్కాలు.. వావ్ అనాల్సిందే..!!

ఎన్టీఆర్ హీరోయిన్ అద్భుతమైన చిట్కాలు.. వావ్ అనాల్సిందే..!!

సమీరా రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈమెకు మంచి ఇమేజ్ ఉంది. తెలుగు,తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు వరసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. వ్యాపారవేత్త అక్షయ్‌ వార్డేను 2014లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో కనిపించడమే మానేసింది. తెలుగులో రానా దగ్గుబాటి హీరోగా నటించిన 2012లో ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. ఎన్టీఆర్ నరసింహుడు, ఆశోక్.. చిరంజీవి జైచిరంజీవ చిత్రాల్లో కూడా నటించింది.

ఒకప్పుడు సమీరా రెడ్డి తన అందంతో కుర్రకారుని కట్టిపడేసింది. అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ.. అభిమానులకు హెల్త్ టిప్స్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. అధిక బరువును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి.? అనే దానిపై సమీరా అభిమానులకు సలహాలు ఇచ్చారు సమీరా రెడ్డి. అధిక బరువును తగ్గించుకునే ఉపాయాల గురించి ఈ బ్యూటీ చెప్పిన విశేషాలను ఓ సారి చూద్దాం. “అధిక బరువును తగ్గించుకునేందుకు వారానికి 4 సార్లు యోగా .. బ్యాడ్మింటన్ లతో పాటు.. అడపాదడపా ఉపవాసం చేస్తున్నా. అంతే కాకుండా చక్కెర పదార్థాలను చాలా లిమిట్ గా తినాలి. నేను దీపావళి నాటికి లక్ష్యాన్ని సాధిస్తానని అనుకుంటున్నాను” అని తెలిపారు సమీరా రెడ్డి. ఈ మేరకు సోషల్ మీడియాలో బరువు పెరిగిన ఫోటోను ఆతర్వాత కాస్త సన్నగా మారిన ఫోటోను షేర్ చేసింది సమీరా రెడ్డి.

 

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

ఇదిలా ఉంటే సమీరా రెడ్డి చాలా ఏళ్లుగా అస్సలు సినిమాలు చేయట్లేదు. అయితే ఈమె రీ ఎంట్రీ ఇస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దాంతో సమీరా రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో అస్సలు నిజం లేదని కన్ఫర్మ్ చేసింది సమీరా.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news