హీరోయిన్లు కెరీర్ విషయంలో ప్లానింగ్ తో వ్యవహరించాలి. ఎందుకంటే..?? సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. అదే హీరోలకు ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చిందంటే.. అరవై ఏళ్లు వచ్చినా ఇంకా హీరోలుగా సినిమాలు చేస్తూనే ఉంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా కాదు. ప్లాప్ లు వచ్చినా.. గ్లామర్ తగ్గినా ఇంక అంతే సంగతులు. అందుకే తమకు క్రేజ్ ఉన్న సమయంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ సంపాదించుకుంటారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్లు స్టార్లుగా ఎదిగారు. కొందరు హీరోయిన్లు కెరీర్ జోరుమీదున్న సమయంలో టాలీవుడ్ ని వదిలి వెళ్లిపోయారు. ఇంకొంత మంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ ని వదలి బాలీవుడ్ బాట పట్టారు.
పాత తరం హీరోయిన్లతో పోల్చలేంగానీ ఈతరం హీరోయిన్లలో కొందరు పదేళ్ళ తరబడి కెరీర్‌ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అనుష్క, నయనతార, త్రిష, శ్రియ.. ఇలా కొంతమంది హీరోయిన్లు నటనతో, అందచందాలతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే వున్నారు. ఇంకా ఇంకా వారికి అవకాశాలు వస్తూనే వున్నాయి.
కొందరు హీరోయిన్లు ఒక్క సినిమాతోనే కెరీర్‌ని అటకెక్కించేస్తుంటే, అతి తక్కువ మంది మాత్రం కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో లక్కుకీ, గ్లామర్‌కీ మాత్రమే ఎక్కువ అవకాశం వుంటోంది. నటనా ప్రతిభ.. అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉపయోగపడ్తోంది హీరోయిన్ల కెరీర్‌కి.
స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ పక్కనపెడితే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త భామలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రేక్షకులు. ప్రేక్షకులు చూసే విధానం లో మార్పులు చోటు చేసుకోవడంతో.. ఎప్పటికప్పుడు కొత్త అందాలను కోరుకుంటున్నారు. అందుకే కొత్తగా ఎవరైనా హీరోయిన్ వస్తే ఆమె తన అందాలతో ప్రేక్షకులను మెప్పిస్తే ఆమెను ఫాలో అయిపోతున్నారు మన ప్రేక్షకులు.