MoviesDSP హీరోగా మారాడొచ్..నిర్మాత ఆ ముద్దుగుమ్మే..?

DSP హీరోగా మారాడొచ్..నిర్మాత ఆ ముద్దుగుమ్మే..?

దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ డీఎస్పీ.. ఈ పేరుకో బ్రాండ్ ఉంది. ఏదైనా పోస్టర్‌‌పై ఆ పేరు ఉందంటే చాలు.. ఆ సినిమా సగం హిట్టు. తన మ్యూజిక్‌తో చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఊపు తెప్పించేస్తుంటారు ఈ సంగీత తరంగం. మాస్ట్రో ఇళయరాజా ఏకలవ్య శిష్యుడిగా తన సంగీతంతో అందరినీ మెప్పిస్తోన్న దేవీ.. గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరక్టర్‌గా కొనసాగుతున్నారు.

రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. గుబురు గడ్డంతో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నాడు. దీంతో నెటిజన్స్ కు  రకరకాల డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే…?? లాక్‌డౌన్‌లో ఇంటి పట్టునే ఉంటున్న చాలా మంది గడ్డాలు పెంచినప్పటికీ.. ఆ తరువాత తీసేసుకున్నారు. కానీ దేవీ మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నారు. ఈ క్రమంలో ఈ మ్యూజిక్‌ మెజీషియన్‌కి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

అందుకోసమే దేవి ఇలా చెంజ్ అయ్యారని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అందుకోసమే రాక్‌స్టార్ ఈ కొత్త గెటప్‌. కాగా ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రం నిర్మించి.. బ్లాక్ బస్టర్ గా రికార్డు బ్రేక్ చేసిన ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఛార్మి ఈ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా ఉండబోతుందట. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. ప్రస్తుతం చార్మి పూరి విజయ్ దేవరకొండ లైగర్ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news