ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్‌బాస్ ఫేం కత్తి మహేష్ రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన్ను ముందుగా నెల్లూరు సింహపురి ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన్ను చెన్నైకు తరలించారు. మహేష్‌కు పలు శస్త్రచికిత్సలు కూడా చేశారు. అయితే కత్తి మహేష్ ప్రాణాపాయం నుంచి బయట పడినా కూడా ఆయనకు ఎడయ కండి చూపు పోయిందట. ఈ విషయాన్ని మహేష్ మేనమామ ఎం.శ్రీరాములు మీడియాకు చెప్పారు.
ప్రమాదంలో మహేష్ తల, ముక్కు, కంటికి తీవ్ర గాయాలపాలయ్యాయి. రెండు కళ్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి వైద్యులు రెండు కళ్లకు శస్త్రచికిత్స చేశారు. అయితే తలలో రక్తస్త్రావం జరగకపోవడంతో మహేష్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. అయితే ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతినడంతో చూపు పోయిందట. ఇక మహేష్ త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీలో ఆయన సన్నిహితులు పలువురు సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.