ఏపీలో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్ గా మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి పలుమార్లు ఎంపీగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి కూడా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే 2014 ఎన్నికల తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా స్టాండ్ విషయంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసే విషయంలో జగన్కు, మేకపాటికి మధ్య తేడా అయితే వచ్చింది. అప్పుడే రాజ్యసభకు ఎంపికైన విజయసాయికి జగన్ ప్రయార్టీ ఇవ్వడం కూడా మేకపాటికి నచ్చలేదు.
ఇక గత ఎన్నికల్లో మేకపాటికి జగన్ ఎంపీ సీటు ఇవ్వలేదు. ఆయన కుటుంబంలో ఆయన తనయుడు గౌతంరెడ్డికి ఆత్మకూరు, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి సీటు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక గౌతంరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. ఇక సీనియర్ గా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి తన ఎంపీ పదవిని కూడా వదులుకున్నారు. ఇప్పుడు ఆయన్ను టీటీడీ చైర్మన్ చేయాలని జగన్ను శాసించే కొందరు సలహాదారులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇక్కడే మరో చర్చ కూడా నడుస్తోంది. ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే.. గౌతంరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగిస్తారని.. ఒకే కుటుంబలో ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లతో పాటు మంత్రి, టీటీడీ చైర్మన్ పదవులు ఎలా ? ఇస్తారన్న ప్రశ్నలు కూడా రైజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్గా ఉన్న జగన్ బాబాయ్ వైవి. సుబ్బారెడ్డికి మరోసారి ఈ పదవి రెన్యువల్ చేసే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు రెడ్డి నేతకు ఈ పదవి ఇవ్వగా.. ఇప్పుడు మళ్లీ రెడ్డికే మరోసారి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే జనాల్లోకి వేరే సంకేతాలు వెళతాయని కొందరు అంటున్నారు. మరి జగన్ నిర్ణయం ఏంటో ? చూడాలి.