వయ్యారి భామ కృతిసనన్..మహేష్ బాబు వన్..నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలను అందుకోలేకపోయింది కృతి. ఆ తర్వాత తెలుగు నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు.. అక్కడ మాత్రమే వరుస ఆఫర్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది…అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోల చిత్రాలతోపాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది.
వరుస విజయాలతో వెళుతున్న ఈ ఢిల్లీ భామ లగ్జరీ లైఫ్ కు బాగానే అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె చేతిలో కనిపించిన ఒక బ్యాగ్ రేటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ముంబైలో షాపింగ్ చేస్తూ ప్లాయిడ్ ట్రౌజర్, పీచ్ కలర్ టాప్ లో కనిపించిన ఈ బ్యూటీని బాలీవుడ్ కెమెరాలు ఫోకస్ చేయగా అమ్మడు ఖరీదైన హ్యాండ్ బ్యాగుతో దర్శనమిచ్చింది. అయితే దీని విలువ అక్షరాలా ఒక లక్షా 50 వేల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. దాదాపు రూ 1.5 లక్షల విలువైన రివ్ గౌచే బ్యాగ్ ను చేతిలో పట్టుకొని ఉండడంతో ఆ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక హ్యాండ్ బ్యాగ్ ధర లక్షన్నర రూపాయలు అంటే సాధారణ విషయమేమీ కాదు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన కృతి రెమ్యునరేషన్ ను మూడు కోట్ల పై మాటే.
ఇకపోతే కృతిసనన్ టైగర్ ష్రాఫ్ తో కలిసి గణపత్ అనే ఒక అవుట్-అవుట్-యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తాజాగా కృతికి మరో భారీ ఆఫర్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిల్ బిల్ హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు బీ టౌన్ లో కథనాలు వస్తున్నాయి.