ఈ ఫొటోలో సోఫాపై క్యూట్ గా నవ్వుతూ ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు ఫిదా బ్యూటీ సాయి పల్లవి. సాయి పల్లవి చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి. సాయిపల్లవికు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఈమె చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది.
ఈ హైబ్రీడ్ పిల్ల చిన్నప్పుడు మస్తు అల్లరి చేసేదట. కాలేజీ రోజుల్లో అయితే తోటి స్నేహితులను ఆటపట్టిస్తూ.. రచ్చ రచ్చ చేసేదట. సాయి పల్లవి ఉంటే చాలు ఎంటర్టైన్మెంట్కి కొదవే ఉండేదికాదట. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫోటోతో పాటు కాలేజీ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించడానికి అవకాశంరావడంతో.. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
ప్రేమమ్ తెచ్చిన క్రేజ్ తో తెలుగులో ఫిదా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించి తెలుగు సినిమాకి పరిచయమయింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి చలాకి నటనకు తెలుగు యువత నిజంగానే ఫిదా అయ్యారు.
ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి క్రేజ్ టాలీవడ్లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేయకున్నా సాయి పల్లవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం.
సాయిపల్లవి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. మారి 2 చిత్రంలో మరోమారు తన డాన్సింగ్ స్కిల్స్ ని బయట పెట్టింది. రౌడీ బేబీ అంటూ సాగే వీడియో సాంగ్ కు తనదైన శైలీలో డ్యాన్స్ వేస్తూ కుర్రకారుల మతిపోగొట్టింది.
ఫిదా సినిమా తర్వాత నాని సరసన ఎం. సి. ఏ చిత్రం లో నటించింది సాయి పల్లవి. ఆ తరువాత పడిపడి లేచే మనసు, సూర్యా 36, కణం, మారి 2 వంటి చిత్రాలలో నటించింది. ఈ ఫిదా బ్యూటీ ప్రస్తుతం విరాట పర్వం సినిమాలో నటిస్తుంది. పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు ఆమె మరింత వన్నె తెస్తుంది. పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని.. ఆ పాత్రలో ఆమె తప్ప.. ఇంకెవరూ అలా నటించలేరు అనేలా నటించడం సాయి పల్లవి ప్రత్యేకత.
ప్రస్తుతం సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాగే విరాటపర్వం , ‘శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తోంది సాయి పల్లవి.