కెఆర్. విజయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నాలుగు ఐదు దశాబ్దాల నుంచి తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితులు. గతంలో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఆమె భక్తిరస చిత్రాలకు కేరాఫ్. కేఆర్. విజయ ఓ అమ్మవారి పాత్ర వేశారంటే నిజమైన అమ్మవారిని చూస్తున్నట్టే ఉంటుంది. ఇక తల్లిగా, బామ్మగా ఎన్నో మెప్పించే పాత్రల్లో కూడా ఆమె నటించింది. కేఆర్. విజయే కాదు ఆమె కుమార్తె కూడా ఓ హీరోయిన్ అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
కేఆర్. విజయ వాళ్లు మొత్తం నలుగురు అక్కా చెళ్లెళ్లు. వీరిలో ఒకరు అయిన కేఆర్. సావిత్రి కూడా మళయాళంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. వీరి తల్లిదండ్రులది ప్రేమ వివాహం. మరో విశేషం ఏంటంటే కేఆర్. విజయ తండ్రిది ఆంధ్రప్రదేశ్.. ఆమె తల్లిది కేరళ. విజయ కూతురు అనూష కూడా బాలనటిగా వెండితెరమీద ఎంట్రీ ఇచ్చింది. మళయాళంలో హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్ గా నటించిన గోల్‌మాల్ గోవిందం సినిమాలో చేసింది.
తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించినా.. ఆ తర్వాత ఆమెకు ఇక్కడ అనుకున్న గుర్తింపు రాలేదు. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో చివరకు ఆమె తెలుగులో సీరియల్స్‌లో నటించి బుల్లితెర మీద కూడా తన అదృష్టం పరీక్షించుకుంది అనూష. గృహ లక్ష్మి, నిన్నే పెళ్ళాడుతా, జయం వంటి పలు సీరియల్స్‌లో నటించింది. అయితే ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వెండితెర మీద మాత్రం ఆమెకు లక్ చిక్కలేదు.