47 ఏళ్ల మలైకా అరోరా 36 ఏళ్ల అర్జన్ కపూర్ మధ్య ప్రేమాయణం ఎప్పుడూ హాట్ హాట్ వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది. తాజాగా తన ప్రియుడు అర్జున్ కపూర్ 36వ పుట్టిన రోజు కావడంతో మలైకా తన ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలోనే తన ప్రియుడిని వాటేసుకుని ప్రేమను ఒలకబోస్తోన్న ఓ ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. వారిద్దరు గతంలో ఓ ట్రిప్‌లో దిగిన ఫొటో అని తెలుస్తోంది. ఈ వయస్సులో కూడా మలైకా తన కంటే 11 ఏళ్లు చిన్నవాడు అయిన అర్జున్‌తో ఇంత ఘాటు ప్రేమ సరసాల్లో మునిగి తేలుతూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది.
ఈ వయస్సులో కూడా ఆమె తన ఒంటిని బాణంలా వంచేస్తూ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఇక అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మలైకా షేర్ చేసిన హ్యాపీ మూమెంట్లో ఆమె ప్రియుడిని కౌగిలించుకుని ప్రేమ ఆస్వాధనలో మునిగిపోయింది. మలైకా, అర్జున్ కపూర్ ఇద్దరు కూడా 2019లోనే తమ ప్రేమపై తొలిసారి ఓపెన్ అయిపోయారు. అప్పటి నుంచి వారిద్దరు వీలున్నప్పుడల్లా విహార యాత్రలకు వెళ్లిపోతూ లైఫ్‌ను ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు.