టాలీవుడ్‌లో కొంత కాలంగా తీవ్ర విషాదాలో చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ ఎడిటర్ కోలా భాస్కర్ (55) కన్నుమూశారు. కొంత కాలంగా గొంతు సంబంధ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిత్తూరులో జన్మించిన కోలా భాస్కర్ పవన్ కళ్యాణ్ ఖుషీ ( 2001) సినిమాతో ఎడిటర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. పలు హిట్ సినిమాలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. తమిళంలో 7జి బృందావన్ కాలనీ – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే – పోక్కిరి (పోకిరి రీమేక్) – వర్ణ – 3 – యుగానికి ఒక్కడు సినిమాలతో ఆయన గుర్తింపు పొందారు. భాస్కర్ చిన్న కుమారుడు బాలకృష్ణ నటుడిగా గుర్తింపు పొందారు.
బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ సతీమణి గీతాంజలి ఓ ద్విభాషా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో నన్ను వదలి నీవు పోలేవులే పేరుతో రిలీజ్ అవ్వగా… ఈ సినిమాను కోలా భాస్కర్ నిర్మించారు.