పూజా హెగ్డేకు అనారోగ్యం.. క‌రోనా ప‌రీక్ష‌తో టెన్ష‌న్‌…!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే వ‌రుస షూటింగ్‌ల‌తో బిజీబిజీగా ఉంది. గ‌త నెల చివ‌రి వ‌ర‌కు ఇట‌లీలో రాధే శ్యామ్ షూటింగ్‌లో బిజీ అయిన ఆమె గ‌త వారం నుంచి అఖిల్ హీరోగా న‌టిస్తోన్న మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. ఆమెకు టాలీవుడ్‌లోనే మ‌రికొన్ని క‌మిట్‌మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ స‌మ‌యంలో ఆమె అనారోగ్యానికి గురైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆమెకు కోవిడ్ సోకిందా ? అన్న సందేహాలు రావ‌డంతో క‌రోనా ప‌రీక్ష కూడా చేయించుకున్నారు. అయితే క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఆమెకు నెగిటివ్ రావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్ర‌స్తుతం ఆమె మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ముంబై వెళ్లిపోయారు. అక్క‌డ విశ్రాంతి తీసుకున్నాక ఆమె షూటింగ్‌కు హాజ‌రు కానున్నారు. పూజ ఈ నెల చివ‌రి నుంచి రాధే శ్యామ్ షూటింగ్‌లో జాయిన్ కావాల్సి ఉంది. మ‌రి ఈ లోగా అనారోగ్యం నుంచి కోలుకుని ఆమె షూటింగ్‌లో పాల్గొంటుందా ?  లేదా అఖిల్ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ షూటింగ్ పెండింగ్‌లో ఉంటుందా ? అన్న‌ది చూడాలి.

ఇప్ప‌టికే రాధే శ్యామ్ ఆల‌స్యం కాగా.. అటు మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ షూటింగ్ కూడా ప‌లు కారాణాల వ‌ల్ల వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. మ‌రి ఆమె అనారోగ్యం నుంచి కోలుకుని ఎప్పుడు ముంబై నుంచి వ‌చ్చి ఈ రెండు సినిమాలు పూర్తి చేస్తుందో ?  కొత్త సినిమాలు ఎప్పుడు టేకాఫ్ చేస్తుందో ?  చూడాలి.