Moviesఆ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ కినుక‌... అదే కార‌ణమా..!

ఆ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ కినుక‌… అదే కార‌ణమా..!

ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే త‌న 27వ చిత్రాన్ని డైరెక్ట‌ర్ క్రిష్ జాగర్లమూడితో చేస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు `విరూపాక్ష‌` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.

 

 

 

ఇక ఇప్ప‌టికే కొత‌ షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే క్రిష్ ఈ గ్యాప్‌లో మెగాస్టార్‌ మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఓ సినిమాను ప‌ట్టాలెక్కించాడు. లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ర‌కుల్ హీరోయిన్‌. తన సొంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు క్రిష్. సినిమా అంతా వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

 

 

అయితే ఈ సినిమా విష‌యంలో క్రిష్‌పై ప‌వ‌న్ కినుక చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. విరూపాక్ష‌ సెట్స్ మీద ఉండ‌గానే.. మ‌రో సినిమాను పట్టాలెక్కించ‌డం ప‌వ‌న్‌కు న‌చ్చ‌లేద‌ని టాక్ న‌డుస్తోంది. లాక్‌డౌన్ వ‌ల్ల స‌మ‌యం దొరికింది కాబ‌ట్టి.. క్రిష్ స్క్రిప్టుపై మ‌రింత శ్ర‌ద్ధ చూపించాలి. మ‌రింత గ్రౌండ్ వర్క్‌ చేయాలి. కానీ, అలా చేయ‌కుండా.. మ‌రో సినిమాలోకి దూరిపోవ‌డంతో క్రిష్‌పై పవ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news