47 ఏళ్ల ఆంటీ… 35 ఏళ్ల హీరో పెళ్లిలో కొత్త ట్విస్ట్‌…!

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి మలైకా ఆరోరా(47).. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ ను పెళ్లి చేసుకుని కొన్నేళ్లకు విడాకులు ఇచ్చేసింది. ఇక ఆ త‌ర్వాత మ‌లైకా బోనీకపూర్ కుమారుడు‌, యంగ్ హీరో అర్జున్ కపూర్(35)తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు, వీరిద్ద‌రూ పబ్లిక్ గానే పార్టీల‌కు, టూర్ల‌కు తిరుగుతూ.. ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలిస్తున్నారు.

 

 

త‌న‌కంటే వ‌య‌సులో 12 ఏళ్లు పెద్ద‌దైన మ‌లైకా అరోరాతో ప్రేమ‌లో ఉన్న అర్జున్ ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా.. మీడియాకు సైతం త‌మ‌ రిలేషన్ గురించి ఓపెన్‌గానే చెప్పేశాడు. దీంతో వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు నెట్టింట్లో వైర‌ల్ అయ్యాయి. అయితే మ‌రోవైపు మాత్రం వ‌య‌సులో అంత వ్యత్యాసం ఉన్న వారిద్ద‌రు ఎలా వివాహం చేసుకుంటార‌నే చ‌ర్చ‌లు ప్రారంభం అయ్యాయి.

 

 

ఇలాంటి త‌రుణంలో పెళ్లిపై అర్జున్ క‌పూర్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. మా ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అందుకే తన ఫ్యామిలీ పెళ్లి విష‌యంలో అభ్యంతరం చెబుతున్నారని తెలిపిన అర్జున్‌.. ఎవరెన్ని చెప్పినా తను మాత్రం తన మనసు చెప్పింది మాత్రమే చేస్తానని స్ప‌ష్టం చేశారు. కుటుంబ‌స‌భ్యులు చెప్పిన మాట‌ల‌ను ప‌ట్టించుకోన‌ని.. తాను అనుకున్న‌దే చేస్తాన‌ని అర్జున్ తెలిపారు.