బిగ్బాస్ నాలుగో సీజన్ ఏమంత ఆసక్తిగా అయితే ముందుకు సాగడం లేదు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. వీరిలో కుమార్ సాయి కూడా ఉన్నాడు. బయటకు వచ్చిన కంటెస్టెంట్లు ఒక్కొక్కరు హౌస్లో తమ అనుభవాలపై ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా కుమార్ సాయి బిగ్బాస్లో రెమ్యునరేషన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా తాను లక్షల రూపాయల రెమ్యునరేషన్ అయితే సొంతం చేసుకోలేకపోయానని చెప్పాడు.
పారితోషకాల విషయంలో తనకు పెద్దగా పట్టింపులు ఉండవని కుమార్ సాయి చెప్పాడు. బిగ్బాస్ హౌస్లోకి రెండో వారంలో ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి మూడు వారాలు మాత్రమే హౌస్లో ఉండి ఎలిమినేట్ అయ్యాడు. స్ట్రైట్ గేమ్ ఆడడంతోనే కుమార్ సాయి ఎక్కువ రోజులు హౌస్లో ఉండలేకపోయాడు.
ఇక బయట కూడా కుమార్ సాయిని అన్యాయంగా ఎలిమినేట్ చేశారన్న ప్రచారం జరగడంతో పాటు అతడికి మంచి సానుభూతితో పాటు ఫ్యాన్స్ టీంలు ఎక్కువుగా ఏర్పడ్డాయి. ఇక గత వారమే ఎలిమినేట్ అవుతాడనుకున్న అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఈ వారం కెప్టెన్ అవ్వడంతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు.