Moviesభ‌ర్త‌తో విడాకుల‌పై ఝాన్సీ ... అదే దెబ్బ‌కొట్టిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

భ‌ర్త‌తో విడాకుల‌పై ఝాన్సీ … అదే దెబ్బ‌కొట్టిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలుగులో గ‌త రెండు ద‌శాబ్దాలుగా త‌న యాంక‌రింగ్‌తో ఝాన్సీ ఎంత‌లా మెప్పిస్తుందో తెలిసిందే. స్ప‌ష్ట‌మైన తెలుగు, అచ్చ తెలుగు ఆడ‌ప‌డుచు అయిన ఝాన్సీ కెరీర్ ప‌రంగా ఎంత ఉన్న‌త స్థితిలో ఉన్నా ఆమె వ్య‌క్తిగ‌త జీవితం మాత్రం ఎన్నో క‌ష్టాల్లో కూరుకుపోయింది. ఇండ‌స్ట్రీకే చెందిన జోగి నాయుడుతో ఆమె కెరీర్ ఉచ్ఛ స్థితిలో ఉండ‌గానే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం బాగానే సాగినా ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరు విడిపోయారు.

 

విడాకుల త‌ర్వాత జోగి నాయుడు మ‌రో పెళ్లి చేసుకున్నా.. ఝాన్సీ మాత్రం ఇంకా అలాగే ఉండిపోయింది. కెరీర్ ప‌రంగా ఉచ్ఛ స్థితిలో ఉండ‌గానే పెళ్లి చేసుకోవ‌డం…. త‌ర్వాత విడిపోవ‌డంతో అది త‌న కెరీర్‌పై ప్ర‌భావం చూపింద‌ని ఝాన్సీ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు. కెరీర్ డౌన్ అయిన‌ప్పుడు ఇండ‌స్ట్రీకి చెందిన కొంద‌రు త‌న‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చినా తాను సున్నితంగా తిర‌స్క‌రించాన‌ని ఆమె చెప్పారు.

 

 

స‌మాజంలో ఒంట‌రి మ‌హిళ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌తార‌నే దానిపై త‌న‌కు పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని చెప్పిన ఝాన్సీ, త‌న మాజీ భ‌ర్త గురించి మాట్లాడేందుకు మాత్రం ఆమె ఇష్ట‌ప‌డ‌లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news