Moviesపెళ్లిపై బాంబు పేల్చిన అనుష్క‌... ఇంత షాక్ ఇచ్చిందేంటి..

పెళ్లిపై బాంబు పేల్చిన అనుష్క‌… ఇంత షాక్ ఇచ్చిందేంటి..

స్వీటీబ్యూటీ అనుష్క వ‌య‌స్సు త్వ‌ర‌లోనే నాలుగు ప‌దుల‌కు చేరువ కానుంది. ఆమె పెళ్లిపై గ‌త నాలుగైదేళ్లుగా పుంకాను పుంకాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కొంద‌రు గాసిప్ రాయుళ్లు అయితే ఆమెకు ప్ర‌భాస్‌తో పెళ్ల‌ని.. మ‌రి కొంద‌రు క‌ర్నాట‌క‌కు చెందిన ఓ ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌తో పెళ్ల‌ని వార్త‌లు రాసేశారు. వాటిని అనుష్క ఖండిస్తూనే వ‌స్తోంది. ఏదేమైనా ఆమె పెళ్లి మ్యాట‌ర్ మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గానే న‌డుస్తోంది.

 

తాజాగా అనుష్క నెటిజ‌న్ల‌తో చేసిన చాటింగ్‌లో మ‌రోసారి పెళ్లి గురించి వ‌చ్చిన ప్ర‌శ్న‌కు పెద్ద బాంబ్ పేల్చింది. తాను పెళ్లిని న‌మ్ముతున్నాన‌ని.. పిల్లలు కూడా ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని… అయితే ఈ రెండు విష‌యాల్లో త‌న‌కు అంత తొంద‌ర లేద‌ని చెప్పింది. త‌న‌కు న‌చ్చిన వ‌రుడు దొరికే వ‌ర‌కు వెయిట్ చేసి పెళ్లి చేసుకుంటాన‌ని అనుష్క చెప్పింది.

 

ఇక త‌న‌కు 20 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్ప‌టి నుంచే త‌న త‌ల్లిదండ్రులు త‌న‌కు పెళ్లి చేయాల‌ని చూస్తున్నార‌ని… అయితే ఇప్పుడు మాత్రం వారు పెళ్లి విష‌యాన్ని త‌న ఇష్టానికే వ‌దిలేశార‌ని చెపుతోంది. ప్ర‌స్తుతం తాను కెరీర్ కొన‌సాగించేందుకే ఇష్టంతో ఉన్నాన‌ని కూడా అనుష్క చెపుతోంది. ఈ లెక్క‌న అనుష్క మ‌రో మూడు నాలుగేళ్ల వ‌ర‌కు పెళ్లి చేసుకునేలా లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news