మన జీవితంలో చాలా అనుభవాలు ఉంటాయి.. వాటిల్లో కొన్ని మంచివి.. కొన్ని చేదువి.. కొన్ని ఎప్పటకీ మర్చిపోలేవి ఉంటాయి. ఈ క్రమంలోనే సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎంఎస్. రాజు ఓ అగ్ర నిర్మాతగా ఇరవై ఏళ్ల క్రితం ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఆయన నిర్మాణంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమా 19 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఆ సినిమా అనుభవాలు తాజాగా సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే ఆ సినిమాకు ముందుగా రాజు విక్టరీ వెంకటేష్‌తో దేవీపుత్రుడు సినిమా తీశారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రు. 14 కోట్ల నష్టం మిగిల్చింది. ఆ దెబ్బకు కోలుకోలేని రాజు ఆ తర్వాత రు 1.30 కోట్ల బడ్జెట్‌తో మనసంతా నువ్వే సినిమా తీసి సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఆ రోజుల్లో ఆ సినిమా రు. 16 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దేవిపుత్రుడు దెబ్బతో పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయిన రాజుకు మనసంతా నువ్వే నిజంగా ఊపిరి లూదింది. ఆ సినిమాతో పుంజుకున్నాక తర్వాత రాజు మళ్లీ మహేష్‌బాబు – గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ఒక్కుడ సినిమా నిర్మించారు.
ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి రాజు దశను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ప్రభాస్‌తో తీసిన వర్షంతో ఇక రాజు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా నిలదొక్కుకున్నారు. అయితే ఆయన సినిమాలన్నింటిలోనూ దేవిపుత్రుడు ఘోర పరాజయంతో రు. 14 కోట్లు లాస్ మిగిల్చింది.