R R R రామ‌రాజు ఫ‌ర్ బీం టైం చెప్పేశాడు… రికార్డుల‌కు రెడీ

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ లాంటి యంగ్ క్రేజీ హీరోలు కలిసి న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో పాటు బాహుబలి 1,2 త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేసే సినిమా కావ‌డంతో సినిమా కోసం భార‌త‌దేశ సినీ ప్రియులు అంద‌రూ ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

 

ఇక ఇప్ప‌టికే ఎన్టీఆర్ అల్లూరి సీతారామ రాజు లుక్ బ‌య‌ట‌కు రావ‌డం అదిరిపోయే రెస్సాన్స్ రావ‌డం జ‌రిగింది. ఇప్పుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో అన్న ఆస‌క్తి నెల‌కొంది. ఈ లుక్ కోసం గ‌త నాలుగు నెల‌లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత షూటింగ్ ప్రారంభించిన ఆర్ ఆర్ ఆర్ యూనిట్ షూటింగ్ మొదలైన వెంట‌నే ఈ నెల 22న కొమ‌రం భీం లుక్ రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

 

 

అనుకున్న‌ట్టుగానే డేట్‌తో పాటు టైం కూడా చెప్పేసింది. ఇందుకు సంబంధించి పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసింది. 22వ‌ తేదీన ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ కొమ‌రం భీం లుక్ రిలీజ్ చేస్తామంటూ పోస్ట‌ర్ వ‌దిలింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు రికార్డుల‌కు రెడీగా ఉండాల‌న్న మాట‌.