టాలీవుడ్‌లో నిన్నటి వరకు ఆయనో హీరో… ఆయన చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అన్నట్టుగా ఉండేది. ఆయన హీరో కాకపోయినా హీరోలతో సమానమైన.. ఇంకా చెప్పాలంటే హీరోలకు మించిన గౌరవం, పలుకుబడి ఉండేవి. ఆయన ఓ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, స్టార్ హీరోలకు అడ్వాన్స్‌లు ఇవ్వకుండా సినిమాలు చేసేస్తాడు. ఏ సినిమా ఏ కథతో తీస్తే హిట్ అవుతుందో జడ్జ్ చేయడంలో ఆయన దిట్ట. ఆయన జడ్జ్‌మెంట్‌కు నిన్నటి వరకు తిరుగు ఉండేదే కాదు.
అలాంటి ఆ స్టార్ నిర్మాతను ఇప్పుడు ఇండస్ట్రీలో ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఆధిపత్య ధోరణి సహించని కొందరు స్టార్ నిర్మాతలే కాదు.. స్టార్ హీరోలు కూడా ఒక్కటై ఇప్పుడు ఆయన్ను ఒంటరిని చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ స్టార్ నిర్మాత తన ఆస్థాన రచయితలను పంపి ముగ్గురు స్టార్ హీరోలకు కథలు చెప్పమని పంపాడట. అయితే ఇందులో ఏవీ వర్కవుట్ కాలేదంటున్నారు.
మహేష్ సినిమా వర్కవుట్ కాలేదు. ప్రభాస్, రామ్‌చరణ్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము మీ బ్యానర్లో సినిమా చేయలేమని చెప్పేశారట. ఇవే కాదు ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా ఆయన బ్యానర్లో కంటే బయట బ్యానర్లలో సినిమాలు చేసేందుకే ఆసక్తితో ఉన్నారట. ఇవన్నీ ఇలా ఉంటే ఆయన నిర్మిస్తున్న, పంపిణీ చేస్తోన్న సినిమాలు కూడా ప్లాప్ అవుతున్నాయి.
ఆయన జడ్జ్‌మెంట్ గత రెండేళ్లుగా బాగా తేడా కొట్టేస్తుందన్నది కూడా ఓపెన్ సీక్రెట్. ఒకప్పుడు ఆయన బ్యానర్‌కు, ఆయన జడ్జ్‌మెంట్‌కు ఉన్న విలువ ఇప్పుడు లేని పరిస్థితి. ఏదేమైనా ఆయన ప్రవర్తనతోనే ఆయన అందరికి దూరం అవుతున్నారని అంటున్నారు.