సినిమాలకు 20 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ అవ్వాలంటే స్టార్ కాస్టింగ్, స్టార్ డైరెక్టర్ లాంటి వాళ్లు ఉండాలి. భారీ బడ్జెట్, భారీ నిర్మాత ఉంటేనే అప్పట్లో లాంగ్ రన్ ఉంటుందన్న నమ్మకాలు ఉండేవి. కానీ వీటికి అతీతంగా వచ్చిన ఓ సినిమా ఎన్న సంచలనాలు క్రియేట్ చేసింది. స్టార్ కాస్టింగ్ లేదు.. పెద్ద బడ్జెట్ లేదు.. పెద్ద కథ కూడా కాదు… అలాంటి సినిమా తెలుగు యువతను మైమరపించి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం క్రియేట్ చేసింది.
ఆ సినిమాయే నువ్వే కావాలి.. ఈ సినిమా 2000 అక్టోబర్ 13న విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 20 ఏళ్లు కంప్లీట్ అయ్యింది. బాలనటుడు తరుణ్ ఈ సినిమాతో హీరో అవ్వగా, రీచా హీరోయిన్ పల్లోడ్‌కు ఇదే తొలి సినిమా. గాయకుడు రామకృష్ణ తనయుడు సాయికిరణ్ లాంటి పూర్తి కొత్త నటులు నటించిన ఈ సినిమాకు కె. విజయ్ భాస్కర్ దర్శకుడు. మాటలు రాసింది త్రివిక్రమ్.
ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెను ప్రభంజనమే క్రియేట్ చేసిందని చెప్పాలి. ఏకంగా 19 సెంటర్లలో 200 రోజులు రన్ అయింది. విజయవాడలో రెండు ధియేటర్లలో విడివిడిగా 200 రోజులు ఆడింది. ఇది విజయవాడ చరిత్రలో ఇప్పటకీ చెక్కు చెదరని రికార్డు. ఇక 6 సెంటర్లలో యేడాది ఆడింది. మళయాళంలో హిట్ అయిన నీరమ్‌కు ఇది రీమేక్.
తర్వాత ఈ సినిమాను ఇదే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో బాలీవుడ్‌లో తుజే మేరి కసమ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో నటించిన రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక నువ్వే కావాలిని ఉషాకిరణ్ మూవీస బ్యానర్ పై రామోజీరావు నిర్మించారు. స్రవంతి రవికిశోర్ సమర్పకుడిగా వ్యవహరించారు.