Sportsహైద‌రాబాద్‌లో మ్యాచ్‌... అంపైర్‌ను బెదిరించిన చెన్నై కెప్టెన్ ధోనీ

హైద‌రాబాద్‌లో మ్యాచ్‌… అంపైర్‌ను బెదిరించిన చెన్నై కెప్టెన్ ధోనీ

ఐపీఎల్ 2020లో భాగంగా మంగ‌ళ‌వారం చెన్నై, హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనీ వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌ట్ల ఐపీఎల్ అభిమానుల‌తో పాటు, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమానులు, నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ధోనీ క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శలు మూట‌క‌ట్టుకుంటున్నారు.

 

అంపైర్ పాల్ రైఫిల్ వైడ్ ఇచ్చేందుకు రెడీ అవుతుండ‌గా.. ధోనీ త‌న క‌నుసైగ‌ల‌తో ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో రైఫిల్ సైలెంట్ అయ్యాడు. శార్దాల్ ఠాకూర్ వేసిన ఓవ‌ర్లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అప్ప‌ట‌కి స‌న్‌రైజ‌ర్స్ 11 బంతుల్లో 24 ప‌రుగులు చేయాలి. శార్దూల్ వైడ్ వేయ‌గా అంపైర్ వైడ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ధోనీ త‌న క‌ను సైగ‌ల‌తో అది వైడ్ కాద‌న్న‌ట్టుగా అంపైర్ వైపు చూశాడు.

 

దీంతో అది వైడ్ అని చేతులు చాపేందుకు రెడీ అవుతోన్న అంపైర్ రైపిల్ చివ‌ర‌కు ధోనీని చూసి సైలెంట్ అయ్యాడు. అయితే హైద‌రాబాద్ కెప్టెన్ వార్న‌ర్ ఈ సంఘ‌ట‌న ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాడు. చెన్నై మ్యాచ్ గెలిచినా ధోనీ క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించాడంటూ వారు ఫైర్ అవుతున్నారు.

Latest news