మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, రామ్‌చరణ్ ఉన్నారు. రామ్‌చరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాపవర్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. ఇక నాడు మెగాస్టార్‌గా ఉన్న చిరు అప్పటికే ఇండస్ట్రీలో టాప్ కమెడియన్‌గా ఉన్న పద్మ శ్రీ అల్లు రామలింగయ్య కుమార్తె అయిన సురేఖను పెళ్లాడాడు. అయితే వీరి పెళ్లి గురించి అల్లు వారింట్లో అప్పట్లో పెద్ద చర్చే నడిచింది అట.
అప్పట్లో ఏం జరిగింది అన్న విషయాన్ని చిరు బావమరిది అల్లు అరవింద్ స్వయంగా గుర్తు చేసుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమా ప్రివ్యూలో చిరంజీవిని చూసిన అరవింద్ అప్పటికే చిరు సినిమాల్లో ఉండడంతో ఈ యువకుడు ఎవరో కాని సినిమాల్లో బాగా చేస్తున్నాడు అనుకున్నాడట అరవింద్.
ఆ తర్వాత సురేఖకు చిరంజీవి తగిన వాడేనా అన్న డిస్కర్షన్ అల్లు రామలింగయ్య లేవనెత్తారట. మనమే సినిమా పరిశ్రమలో ఉంటూ ఓ హీరోకు మన చెల్లిని ఇవ్వవచ్చా ? అన్న డిస్కర్షన్ అనవసరం అని.. అబ్బాయి మంచివాడు అయితే చాలని అరవింద్ చెప్పారట. అలా చివరకు చిరు – సురేఖ దంపతులు అయ్యారు.