తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రతి రోజు ప్రజల నుంచి షాకులు తగులుతూనే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ప్రజలను పరామర్శించేందుకు రోజు బస్తీల్లో, వార్డుల్లో పర్యటిస్తున్నారు. ప్రతి రోజు ఆమెకు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఆమె సమాధానం చెప్పలేక సతమతమవుతున్నాయి.
తాజాగా మరోసారి సబితను స్థానికులు అడ్డుకున్నారు. మీర్‌పేట్ మిథిలానగర్‌లో మంత్రి సబితను స్థానికులు అడ్డుకుని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు సమస్య తీర్చకుండా ఓదార్పు యాత్రలు చేస్తారా ? అని ప్రశ్నించారు. చివరకు సబిత సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాక కాని వారు ఆమెను వదల్లేదు. గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో పలు కాలనీలు జలమయమయ్యాయి.