తార‌క్ సిక్స్‌ప్యాక్ ఫొటో చంపేసిందిగా… కేక పెట్టించేశాడు..

టాప్ ఫొటోగ్రాఫ‌ర్ డాబూ ర‌త్నాని మ‌రోసారి యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆయ‌న ఫొటోగ్రాఫ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 25 ఏళ్లు అయిన సంద‌ర్భంగా గతంలో ఎంతోమంది ప్ర‌ముఖుల‌తో తీసిన స్టిల్స్ ఆల్బ‌మ్‌ను ఆదివారం షేర్ చేశాడు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌లో ఉన్న అరుదైన ఫొటోను ఆయ‌న షేర్ చేశాడు. ఈ ఫొటో 2018లో ఎన్టీఆర్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా కోసం చేసిన టైంలో తీసిన ఫొటో ఇది అని తెలుస్తోంది.

 

ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రత్నానీ సినీ సెలబ్రిటీలు కరీనా కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, అలియా భట్‌, జాన్‌ అబ్రహం, సన్నీ లియోని, పరిణీతి చోప్రా, హృతిక్‌ రోషన్‌ తదితరులతో ఫొటోషూట్‌లో భాగంగా తీసుకున్న చిత్రాల్ని పంచుకున్నారు.