ఈటీవీలో ప్రసారం అవుతోన్న కామెడీ షో ఎక్స్ ట్రా జబర్దస్త్ షో తాజాగా 300వ ఎపిసోడ్‌లోకి అడుగు పెట్టింది. దీంతో సెట్ పండగ వాతావరణం నెలకొనడంతో పాటు సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కామెడీ షోలోని కమెడియన్ల గురించి రాకేష్ స్కిట్ చేసి అందరిని నవ్వించాడు. ఇందుకోసం రాకేష్ పేదరాశి పెద్దమ్మ గెటప్‌లో కనిపించాడు. ఇదిలా ఉంటే ఓ స్కిట్లో రవి, అనసూయతో పాటు టిక్‌టాక్ దుర్గారావు దంపతులు కూడా తళుక్కున మెరిశారు.
సెలబ్రేషన్స్‌లో భాగంగా రోజా రష్మిపై నీకున్న అభిప్రాయం అభిమానుల కోసం చెప్పమన్న ప్రశ్నతో షాక్ ఇచ్చింది. రోజా అడిగిన ఈ ప్రశ్నతో రష్మి – సుధీర్ ఒక్కసారిగా సిగ్గుపడ్డారు. అనంతరం సుధీర్ మాట్లాడుతూ సుధీర్ అంటే కొంతమంది మాత్రమే గుర్తు పడతారని.. అయితే రష్మీ – సుధీర్ అంటే మాత్రం మొత్తం అందరూ గుర్తు పడతారని చెప్పాడు.
ప్రతి మగవాడి విజయం వెనక ఓ మహిళ ఉందని అంటారు.. అయితే ఎనిమిది సంవత్సరాలుగా నా విజయం వెనక కాదు కాదు నా పక్కనే ( రష్మిని ఉద్దేశించి ) ఉంది అని చెప్పాడు. సుధీర్ చెపుతోన్న మాటలకు పక్కనే ఉన్న రష్మి కూడా తబ్బిఉబ్బయ్యింది. ఏదేమైనా రష్మీ – సుధీర్ ఎప్పుడూ బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతుంటారు.