యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వరుసగా ఐదు హిట్లు రాగా కరోనా లాక్‌డౌన్ లేకపోయి ఉంటే మనోడు వరుసగా ఆరో హిట్‌కు కూడా రెడీ అయ్యేవాడే. ఏడు నెలల గ్యాప్ తర్వాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాలో నటించనున్నాడు.
హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై చినబాబు, కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు దూకుడుగానే ముందుకు వెళ్లిన ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలకు వసూళ్లు తక్కువుగా వస్తాయన్న అంచనాల నేపథ్యంలో ఆచితూచి మందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు పారితోషకం భారీగా తగ్గించుకుంటున్నాడట.
ఇప్పటి వరకు వరుస హిట్లతో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రు. 30 కోట్ల పైమాటే. అయితే ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న తన అన్న కళ్యాణ్‌రామ్‌కు భారం కాకూడదని తన రెమ్యనరేషన్ రు.20 కోట్లకు కాస్త అటూ ఇటూగానే తీసుకుంటున్నాడట. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాలను బట్టి తర్వాత రెమ్యనరేషన్ గురించి ఆలోచించుకోవచ్చని కూడా ఎన్టీఆర్ అన్నకు చెప్పేశాడట.
ఏదేమైనా జై లవకుశ సినమాతో కళ్యాణ్‌రామ్‌ను గట్టెక్కించిన ఎన్టీఆర్ ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో అన్నకు మరింత హెల్ఫ్ చేస్తున్నాడు. ఏదేమైనా ఎన్టీఆర్‌కు సోదరులు అంటే ఎంత అమితమైన ప్రేమో మరోసారి ఫ్రూవ్ అయ్యిందనే చెప్పాలి. ఇక వచ్చే దసరాకు ఈ సినిమను రిలీజ్ చేయనున్నారు.