సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్ డైరెక్టర్ శంకర్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా 2010లో రోబో సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా కథ విషయంలో వివాదం నడుస్తోంది. ఆరూర్ తమిళనాధన్ అనే రచయిత రోబో కథ తనది అంటూ మీడియా ముందుకు వచ్చాడు.
దీనిపై సదరు రచయిత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసు అక్కడ కొనసాగుతోంది. ఈ కేసు అప్పటి నుంచి సాగుతూనే వస్తోంది. దీంతో ఈ కాపీ రైట్ కేసు కొట్టి వేయాలంటూ దర్శకుడు శంకర్ చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు శంకర్‌కు షాక్ ఇచ్చింది. ఈ కేసును కొట్టి వేయడం కుదరదని చెప్పింది.
దీంతో మద్రాస్ హైకోర్టులోనే మళ్లీ ఈ కేసు వాదనకు రానుంది. ఈ కాపీ వివాదంలో కేసు వేసిన రచయిత అరూర్ తమిళనాధన్ నష్టపరిహారంగా కోటి రూపాయలను ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. శంకర్ ఆ మొత్తం ఇస్తే కథ తనది కాదని ఒప్పుకున్నట్లుగా అవుతుంది. అందుకే ఆయన పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదట.