Moviesగీతా మాధురి కాపురంలో చిచ్చు పెట్టిన స్టార్ యాంక‌ర్‌.. క్లైమాక్స్ ఇదే..!

గీతా మాధురి కాపురంలో చిచ్చు పెట్టిన స్టార్ యాంక‌ర్‌.. క్లైమాక్స్ ఇదే..!

సోష‌ల్ మీడియా వ‌చ్చాక కావాల్సినంత క్రియేటివిటీతో పాటు కాంట్ర‌వ‌ర్సీ కూడా దొరుకుతోంది. ఈ క్ర‌మంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ టీజ‌ర్లో ర‌ష్మిక – నందు మ‌ధ్య కావాల్సినంత కెమిస్ట్రీ ఉంద‌ని.. గీతా మాధురి ఈ వీడియో చూశాక భ‌ర్త నందుతో గొడ‌వ ప‌డిందంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన నందు మీ బొంద‌రా మీ బొంద‌.. గీతా ఇది చూశావా ?  ఈ యూట్యూబ్ ఛానెల్ కోసం మ‌నం గొడ‌వ ప‌డాలంట అని కామెంట్ పెట్టాడు. ఇది చూసిన గీతా మాధురి వెంట‌నే క‌రోనాకు వ్యాక్సిన్ అయినా వ‌స్తుందేమో కాని ఈ థంబ్ నెయిల్ ఫెలోస్ మాత్రం మార‌ర‌ని కామెంట్ చేసింది.

 

గీత‌, నందు డిస్క‌ర్ష‌న్ చూసిన హాట్ యాంక‌ర్ ర‌ష్మీ కూడా రిప్లే ఇచ్చింది. ఏంటో వీళ్ల బాధ అంటూ థంబ్ నెయిల్స్ గురించి స్పందించింది. నందు చేసిన కామెంట్‌తో వీళ్ల‌పై కామెంట్ చేసిన యూ ట్యూబ్ ఛానెల్‌ థంబ్ నెయిల్ వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇటీవ‌ల రిలీజ్ అయిన బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ టీజ‌ర్లో నందు పూరి జ‌గ‌న్నాథ్ వీరాభిమానిగా పోతురాజుగా క‌నిపించాడు.

 

ఇక ర‌ష్మి ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించింది. ఈ టీజ‌ర్‌కు సూప‌ర్ టాక్ రావ‌డంతో నిజంగానే బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక నందుతో పాటు హాట్ యాంక‌ర్ ర‌ష్మి కాంబినేష‌న్ కావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news