దివంగత లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనతో ఉన్న అనుబంధం తెంచుకుని పై లోకాలకు వెళ్లిపోయారు. నాలుగు దశాబ్దాలుగా బాల సుబ్రహ్మణ్యం ఎన్నో భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ రవివర్మ బాలుతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
తాను చిన్నప్పటి నుంచి బాలు పాటలు వింటూ పెరిగానని చెపుతోన్న ఆయన తాను ఇండస్ట్రీలో ఉన్నానంటే అందుకు బాలుయే కారణమని చెప్పారు. బాలు గారు ఏ పాటలు పాడినా ఆయన ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేసే వారు కాదని.. ఆయనకు డబ్బుల మీద ఎప్పుడు మమకారం ఉండేది కాదని ఆయన చెప్పారు. ఇక రవివర్మ మ్యూజిక్ ఇచ్చిన చీమ ప్రేమ మధ్యలో భామ కోసం బాలు ఓ పాట పాడారట.
రెమ్యునరేషన్ ఎంతని రవివర్మ అడిగారట. ట్రాక్ పంపి మేనేజర్‌తో మాట్లాడాలని బాలు చెప్పారట. వెంటనే రవివర్మ మేనేజర్‌కు ట్రాక్ పంపి డబ్బులు గురించి అడిగితే… సార్ మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పారని బాలు మేనేజర్ చెప్పారట. ఆయనకు నా గురించి పెద్దగా తెలియదు.. మేం కూలిసి కూర్చొన్న సందర్భాలు కూడా లేవు. అయినా ఆయన నాపై ఇంత అభిమానం చూపించారంటూ రవివర్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.