Moviesమ‌న‌సులో బాధంతా వెళ్ల‌గ‌క్కిన ఇలియానా... అదే కార‌ణ‌మా..!

మ‌న‌సులో బాధంతా వెళ్ల‌గ‌క్కిన ఇలియానా… అదే కార‌ణ‌మా..!

దేవ‌దాస్ సినిమాతో తెలుగు సినిమాకు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన ఇలియానా ఆ త‌ర్వాత రెండో సినిమా పోకిరీతోనే తెలుగులో తిరుగులేని స్టార్ డ‌మ్ తెచ్చుకుంది. ఆ టైంలో ఇలియానాతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ టాప్ హీరోలు, ద‌ర్శ‌కులు వెంట ప‌డేవారు. దేవుడు చేసిన మ‌నుషులు సినిమా త‌ర్వాత ఆమె బాలీవుడ్‌కు చెక్కేసింది. ఇక్క‌డ స్టార్ డ‌మ్ ఉండ‌గానే దానిని వ‌దులుకుని బాలీవుడ్‌కు వెళ్లిన ఇలియానాకు అక్క‌డ హిట్లు లేవు.

 

ఆ త‌ర్వాత ఆమె చేసిన త‌ప్పు తెలుసుకుని తిరిగి టాలీవుడ్‌లో ఛాన్సుల కోసం ట్రై చేసినా అప్ప‌టికే ఇక్క‌డ అనుష్క, న‌య‌న‌తార‌, ర‌కుల్ లాంటి క్రేజీ హీరోయిన్లు పాతుకు పోవ‌డంతో ఇలియానాను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌గా ఆమె ర‌వితేజ ప‌క్క‌న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో ఇలియానా లుక్ చూసిన వారు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు.

 

ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడు హాట్ హాట్ ఫొటోల‌తో ర‌చ్చ చేసే ఇలియానా తాజాగా అంత‌ర్జాతీయ బాలికల దినోత్స‌వం సంద‌ర్భంగా చేసిన పోస్టు వైర‌ల్ అవుతోంది. ఈ రోజు అబ్బాయిల‌తో స‌మానంగా అమ్మాయిల‌ను చూడ‌డం లేద‌ని.. ఎంత మంది త‌ల్లిదండ్రులు త‌మ అబ్బాయిల‌తో స‌మానంగా అమ్మాయిల‌ను చ‌దివిస్తున్నారంటూ వాపోయింది. బాలిక‌లు ఈ రోజును నిజంగా సెల‌బ్రేట్ చేసుకునే ప‌రిస్థితులు ఉన్నాయా ? అని ఆమె ప్ర‌శ్నించింది.

 

బాలుర‌తో బాలిక‌ల‌కు స‌మానంగా హ‌క్కులు, అవ‌కాశాలు క‌లుగుతున్నాయా ?  బాలిక‌ల‌కు ర‌క్ష‌ణ‌తో కూడిన అంద‌మైన జీవితం ఉంటుంద‌ని తాను ఆశిస్తున్న‌ట్టు చెప్పింది. మొత్తానికి ఇలియానా అమ్మాయిల‌కు చాలా అన్యాయం జ‌రుగుతోంద‌ని వాపోయింది. ప్ర‌స్తుతం ఈ పోస్టు గురించి నెట్టింట్లో చ‌ర్చ న‌డుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news