పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక టీ 20 క్రికెట్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 క్రికెట్లో పదివేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ల జాబితాలో చేరిన షోయబ్ ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ అయ్యాడు. శనివారం పాక్ టీ 20 క్రికెట్ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ కైబర్ పఖ్‌తున్‌క్వా జట్టు తరఫున ఆడుతూ బలోచిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మాలిక్ 44 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు.
మాలిక్ 395 టీ20 మ్యాచ్‌ల్లో 10,027 పరుగులు సాధించాడు. ఇక వెస్టిండిస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ 13, 296 పరుగులు సాధించాడు. గేల్ 404 టీ 20 మ్యాచ్‌లలో ఈ రికార్డు సాధించాడు. ఆ తర్వాత మరో వెస్టిండిస్ క్రికెటర్ పోలార్డ్ 518 మ్యాచ్‌లలో 10, 370 పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో మాలిక్ నిలిచాడు. కాగా,ఆసియా నుంచి ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్‌గా మాలిక్ గుర్తింపు పొందాడు.