మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ పెళ్లి చేసుకోకుండానే పిల్లలను దత్తత చేసుకుని అమ్మ అయ్యింది. ఇప్పటికే ఆమె వయస్సు 45 ఏళ్లకు పైనే ఉంది. ఇక ఈ వయస్సులో తనకంటూ ఓ భర్త కావాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆమె కొన్నాళ్లుగా ఫ్యాషన్ డిజైనర్ రోషన్ షాతో డేటింగ్లో ఉంది. వీరిద్దరు కలిసి తీసుకున్న ఫొటోలతో సోషల్ మీడియాలో మామూలు రచ్చ జరగడం లేదు. ఇక తాజాగా వీరిద్దరు సోషల్ మీడియా సాక్షిగా పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు.
వీరిద్దరు కలిసి సోషల్ మీడియా లైవ్లో ఉండగా.. ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు సుస్మిత చిన్న స్మైల్తో సరిపెట్టుకుంది. అయితే రోషన్ మాత్రం త్వరలోనే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి అందరూ కలిసి పెళ్లి తేదీపై ఓ నిర్ణయానికి వస్తామని చెప్పాడు. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నాకే పెళ్లి గురించి ప్రకటన చేస్తామని రోషన్ చెప్పాడు.
ఏదేమైనా వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న విషయంపై క్లారిటీ వచ్చింది. చాలా కాలంగా వీరిద్దరు సహజీవనంలోనే ఉన్నారు. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుని భార్య భర్తలు అవుతారేమో… ఇక చిన్న ట్విస్ట్ ఏంటంటే సుస్మిత కంటే రోషన్ చాలా చిన్నవాడు.