ఈ ప్రపంచం అనేదే పెద్ద మాయ. ఈ భూ మండలంలో ఇప్పటకీ మనుష్యుల దృష్టికి రానివి ఎన్నో వింతలు, విశేషాలు, జలపాతాలు, కొండలు, కోనలు ఉన్నాయి. ఈ క్రమంలో అవి కొత్తగా కనుగొన్నాక వాటిని చూసి మనం షాక్ అవుతుంటాము. తాజాగా ప్రపంచం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఎవ్వరి దృష్టికి రాని ఓ సీక్రెట్ బీచ్‌ను కనుగొన్నారు. మెక్సికో పశ్చిమ తీరంలోని మరియెట్ దీవుల్లో ఉన్న ఈ సీక్రెట్ బీచ్ ఇప్పుడు బయట పడింది. పై నుంచి కెమేరాలో చూస్తే ఇది ఓ బలంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
దీనిని పలువురు సీక్రెట్ బీచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఒకప్పుడు మెక్సికో బాంబర్లు బాంబులను దాచేందుకు ఈ దీవిని ఉపయోగించారు. ఆ తర్వాత దీనిని మైక్సికో ప్రభుత్వం సైనిక్ జోన్‌గా ప్రకటించింది. మొదటి నుంచి ఈ దీవి సైనిక కార్యకలాపాలకే ఉపయోగపడుతోన్నందున …. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో ఎవరికి పెద్దగా తెలియలేదు.
అయితే ఇప్పుడు ఈ రహస్య బీచ్‌ను పై నుంచి చూస్తే ఇది ఓ బిలంలా ఉంది. ముందు నుంచి బాంబులు వేయడంతో ఇది ఓ బిలంలా కనిపించేందుకు కారణమైంది. టార్సిసియో స్వారెజ్ అనే వీడియో గ్రాఫర్ ఇటీవల అక్కడికెళ్లి తన డ్రోన్ కెమేరాతో బిలం బీచ్‌ను అద్భుతంగా వీడియో తీసి విడుదల చేయడం ఇప్పుడు ఈ అందాలు ప్రపంచం దృష్టికి వచ్చింది.