Moviesబ్రేకింగ్‌: డ‌్ర‌గ్స్ కేసులో రియాకు బెయిల్‌.... ఆ వెంట‌నే ట్విస్ట్‌

బ్రేకింగ్‌: డ‌్ర‌గ్స్ కేసులో రియాకు బెయిల్‌…. ఆ వెంట‌నే ట్విస్ట్‌

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి త‌ర్వాత బాలీవుడ్ హీరోయిన్ రియా చ‌క్ర‌వ‌ర్తి చుట్టూ అనేక వివాదాలు ముసుకున్నాయి. తాజాగా డ్ర‌గ్స్ కేసులో జైలులో ఉన్న ఆమెకు ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది. బాంబే హైకోర్టు రియాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమో సోద‌రుడు సోవిక్‌కు మాత్రం బెయిల్ తిర‌స్క‌రించిన హైకోర్టు ఆయ‌న రిమాండ్‌ను అక్టోబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. సెప్టెంబ‌ర్ 8 నుంచి రియా చ‌క్ర‌వ‌ర్తి జైల్లోనే ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

డ్ర‌గ్స్ కేసులో రియాకు బెయిల్ ఇవ్వొద్ద‌ని.. న్యాయస్థానాకి ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది.బెయిల్‌ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని కూడా చెప్పింది. సుశాంత్‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేయ‌డంలో రియా హ‌స్తం ఉంద‌ని కూడా ఎన్సీబీ చెప్పింది. అయితే ఇరు వాద‌న‌లు విన్న త‌ర్వాత కోర్టు ఆమెకు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

 

 

అలాగే రియా ముంబై విడిచి వెళ్ల‌కూడ‌ద‌ని.. రు. ల‌క్ష పూచీ క‌త్తు స‌మ‌ర్పించాల‌ని కూడా బాంబే హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆమె ప్ర‌తి ప‌ది రోజుల‌కు కోర్టుకు వెళ్లి సంత‌కం చేయాల‌ని కూడా ఆదేశించింది. మ‌రి ఆమె సోద‌రుడు షోవిక్‌కు ఎప్ప‌ట‌కీ బెయిల్ వ‌స్తుందో ?  చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news