ఊహలు గుసగుసలాడే వేళ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. ఆమెకు కెరీర్ పరంగా సరైన హిట్లు లేకపోయినా అవకాశాలకు మాత్రం కొదవేలేదు. ఎప్పుడు చేతిలో అవకాశాలు ఉంటూనే ఉంటాయి. లాక్‌డౌన్ వేళ ఛాన్సులు లేక ఇంట్లోనే ఉన్న రాశీ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ప్రశంసలను అయినా విమర్శలను అయినా ఒకేలా స్వీకరిస్తానని చెప్పింది.
నటన అంటే తనకు ఎంతో ఇష్టమని.. వృత్తిపరంగా తాను అందరితోనూ పోటీ పడతానని. అయితే ఎవ్వరితోనూ సంఘర్షణు మాత్రం కోరుకోనని చెప్పింది. ఇక క్యాస్టింగ్ గురించి కూడా రాశీ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటి వరకు తనకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని చెప్పిన రాశీ.. అలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వారు మాత్రం తనకు ఆ విషయాలు చెప్పారని.. వారి బాధను తనతో పంచుకున్నారని రాశీ చెప్పింది.
ఆ సమయంలో తనకు ఎంతో బాధ కలిగిందని.. సమాజంలో మహిళల స్థితిగతులు చాలా దారుణంగా ఉంటున్నాయని కూడా రాశీ చెప్పింది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్న వార్తలు వింటున్నప్పుడే ఒక్కసారిగా కసితో ఏదో చేయాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని రాశీ చెప్పింది. ప్రస్తుతం రాశీ తమిళ్‌లో అరణ్మణి 3, మేథావి సినిమాలు చేస్తున్నారు.