విజ‌య‌వాడ మ‌ర్డ‌ర్ కేసులో మ‌రో ట్విస్ట్‌… యువ‌తిని ఎలా చంపాడంటే..!

విజయవాడలో ప్రేమోన్మాది చేతిలో ఓ ప్రేమోన్మాది చేతిలో ఓ బీటెక్ విద్యార్థిని హ‌త్య‌కు గురైన సంగ‌తి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌ల‌క‌లం రేపింది. అయితే నిందితుడు నాగేంద్ర యువ‌తిని ప్లానింగ్‌తోనే మ‌ర్డ‌ర్ చేసిన‌ట్టు పోలీసులు  గుర్తించారు. యువ‌తితో అత‌డు దిగిన ఫొటో నిజం కాద‌ని తేల్చారు. అప్పుడే నిద్ర లేచిన యువతి గదిలోకి చాకచక్యంగా ప్రవేశించి ఆమెపై నాగేంద్ర దాడి చేశాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు త‌మ‌కు పెళ్ల‌యిన‌ట్టు క్రియేట్ చేసిన వీడియో అబ‌ద్ధ‌మ‌ని దివ్య కుటుంబ స‌భ్యులు చెపుతున్నారు.

 

దివ్య ఈ నెల క్రీస్తురాజ‌పురంలో త‌న ఇంట్లోనే హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఉద‌యం 10 గంట‌ల‌కు టిఫిన్ చేసేందుకు ఆమె త‌ల్లి కుసుమ దివ్య‌ను నిద్ర లేపింది. ఆ త‌ర్వాత వలంటీర్ రావ‌డంతో కుసుమ కింద‌కు వెళ్లిందే. అప్ప‌టికే నాగేంద్ర వెన‌క వైపునుంచి దివ్య గ‌దిలోకి వెళ్లి గ‌డి పెట్టుకున్నాడు. కుసుమ తిరిగి మేడ‌మీద‌కు వెళ్లి చూడ‌గా అక్క‌డ అబ్బాయి చెప్పులు ఉన్నాయి. అనుమానం వ‌చ్చి ఆమె త‌లుపు కొట్టినా తీయ‌లేదు. ఆమె చుట్టుప‌క్క‌ల వాళ్ల‌ను పిల‌వ‌గా వాళ్లు తలుపులు ప‌గ‌ల‌గొట్టి లోప‌ల‌కు వెళ్లారు.

 

లోప‌ల దివ్య ర‌క్తం మ‌డుగులో ఉంది. నాగేంద్ర చిన్న గాయాల‌తో  ఓ మూల‌న ఉన్నాడు. ఆటోలో ఆస్పత్రికి తరలించే సమయంలో నాగేంద్ర గొంతుపై గాయం చేసుకున్నాడు. దివ్య శ‌రీరంపై 13 క‌త్తిగాట్లు ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. దివ్య‌ను ఓ ప‌థ‌కం ప్ర‌కారం చంపాల‌నే నాగేంద్ర ఇలా చేశాడ‌ని పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఇక దివ్య సెల్ఫీ వీడియోలో వ్య‌క్తం చేసిన ఆవేద‌న కూడా నాగేంద్ర గురించే అంటున్నారు. ఇక దివ్య త‌న‌కు దూరం అయ్యాక ఆమె స్నేహితురాళ్ల‌ను వాడుకుని న‌కిలీ ఇన్‌స్టా ఖాతాలు తెర‌చి కూడా దివ్య‌ను నాగేంద్ర వేధించాడంటున్నారు.