కోడిగుడ్డు కూర ప్రాణం తీసిందే.. అస‌లు జరిగింది ఇది..!

మ‌హారాష్ట్ర‌లో కోడిగుడ్డు కూర ఓ వ్య‌క్తి ప్రాణం తీసింది. విన‌డానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఓ వ్య‌క్తి కోడిగుడ్డు కూర వండ‌లేద‌ని త‌న స్నేహితుడిని దారుణంగా హ‌త్య చేశాడు. మ‌హారాష్ట్ర నాగ‌పూర్‌లోని ముంకాపూర్‌లో బ‌న్సారి అనే వ్య‌క్తికి గౌర‌వ్ గైక్వాడ్ అనే ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. వీరు వీకెండ్‌లో పార్టీలు చేసుకునే వారు.. మందు తాగేవారు. నిన్న రాత్రి కూడా వీరు మందు పార్టీ చేసుకున్నారు.

 

బ‌న్సారీ, గైక్వాడ్ ముందుగా ఆఫీస్ విష‌యాలు మాట్లాడుకున్నారు. ఆ త‌ర్వాత గైక్వాడ్ బ‌న్సారీని త‌న‌కు కోడిగుడ్డు కూర వండిపెట్ట‌మ‌ని కోరాడు. ఆ స‌మ‌యంలో ఇంట్లో కోడిగుడ్లు లేక‌పోవ‌డంతో పాటు అర్ధ‌రాత్రి కావ‌డంతో తాను కోడిగుడ్డు కూర వండ‌లేన‌ని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి లోనైన గైక్వాడ్ బ‌న్సారీపై ఇనుప రాడ్డుతో బ‌లంగా కొట్ట‌డంతో బ‌న్సారీ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

 

మ‌ద్యం మ‌త్తులో స్నేహితుడిని చంపేశాన‌ని తెలుసుకున్న గైక్వాడ్ బ‌న్సారీ డెడ్ బాడీనీ ప‌క్క‌నే ఉన్న గ్యారేజ్‌లో ప‌డేసి ప‌రార‌య్యాడు. ఆ త‌ర్వాత పోలీసుల విచారించి గైక్వాడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచారిస్తున్నారు.