మెగాస్టార్ చిరంజీవి – ఆయన బావమరిది అగ్రనిర్మాత అల్లు అరవింద్ మధ్య గ్యాప్ ఉందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. వాస్తవానికి చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150ను అల్లు అరవింద్ నిర్మించాలనుకున్నారు. అయితే వారి మధ్య ఉన్న పొరాపొచ్చల వల్లే చివరకు చరణ్ అప్పటికప్పుడు బ్యానర్ పెట్టి ఆ బ్యానర్లోనే ఈ సినిమా నిర్మించాడు. ఆ తర్వాత సైరాకు కూడా అరవింద్‌కు ఛాన్స్ ఇవ్వలేదు.. ఇప్పుడు ఆచార్య విషయంలోనూ అరవింద్‌ను పక్కన పెట్టారు.
ఇక చిరు నటించే నెక్ట్స్ మూడు సినిమాల విషయంలోనూ అరవింద్‌ను పట్టించుకోవడం లేదంటేనే వీరి మధ్య తేడా కొట్టిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రామ్‌చరణ్ సినిమాల కథలు వినే బాధ్యతలను కూడా చిరు అరవింద్‌కు అప్పగిస్తే అరవింద్ తాను కథలు విని మంచి కథలు బన్నీకి రిఫర్ చేశాడన్న విషయమే అట. అప్పట్లో చరణ్‌కు వరుసగా ప్లాపులు వచ్చాయి. అప్పుడు బన్నీ కెరీర్ స్వింగ్ అయ్యింది.
అదలా ఉంటే ఇప్పుడు గండిపేటలో అల్లు స్టూడియోస్ పేరుతో అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు కొత్తగా నిర్మాణం ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ రాలేదు. అయితే మెగా ఫ్యామిలీ కూడా ఫ్లోర్లు నిర్మించాలని చూస్తున్నారట. అల్లు అరవింద్ స్టూడియోలకు పోటీగా మెగా ఫ్యామిలీ ఫ్లోర్ల నిర్మాణం ప్రారంభించాలనుకోవడం.. రెండు కుటుంబాలు ఒకే బిజినెస్‌లోకి అడుగు పెట్టాలని చూస్తుండడం వీరి మధ్య గ్యాప్ సందేహాలకు కారణమైతే.. రామ్‌చరణ్, సుస్మిత కూడా ఆహాకు పోటీగా మరో ఓటీటీ ప్లాట్ ఫాం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఏదేమైనా ఈ రెండు కుటుంబాల వ్యవహారాలు చూస్తుంటే పోటీ ఉన్నట్టే అర్థమవుతోంది. మరి వీరి మధ్య నిజంగా గ్యాప్ ఉందా ? అది క్రియేట్ అయ్యిందేనా ? అన్నది వారికే తెలియాలి.