Moviesప‌వ‌న్ మాజీ భార్య రేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం...

ప‌వ‌న్ మాజీ భార్య రేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం…

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, మాజీ హీరోయిన్ రేణుదేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్నారా ?  అంటే అవున‌నే స‌మాచారం వ‌స్తోంది. రేణు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా ? అంటే అవున‌నే గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. 2000లో వ‌చ్చిన బద్రి సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచయం అయిన రేణు ఆ త‌ర్వాత అదే ప‌వ‌న్‌తో 2003లో జానీ సినిమాలో న‌టించింది. ఇక ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను వివాహం చేసుకుంది.

 

 

వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌తో ఏర్ప‌డిన గ్యాప్ వ‌ల్ల ఆమె విడాకులు తీసుకుని పూణేలో ఉంటోంది. ఇక రేణు ఇప్పుడు 17 ఏళ్ల త‌ర్వాత మళ్లీ వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ ఆధ్యా. లేడీ ఓరియంటెడ్ మూవీగా తెర‌కెక్కే ఈ సినిమాలో రేణు దేశాయ్ శ‌క్తివంత‌మైన పాత్ర‌లో క‌నిపిస్తార‌ని టాక్‌. ఇక నందిని రాయ్‌, క‌బాలీ ఫేమ్ సాయి ధ‌న్సిక‌తో పాటు బాలీవుడ్ న‌టుడు వైభ‌వ్ త‌త్వావాడీ త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టించారు.

 

 

 

ఎస్‌. ర‌జ‌నీకాంత్ నిర్మించే ఈ సినిమాలో హుషారు ఫేమ్ తేజ కూర‌పాటి, గీతిక ర‌త‌న్ యువ జంటగా నటించనున్నారు. ట్విస్ట్ ఏంటంటే రేణు కుమార్తె పేరు ఆద్య‌.. ఇప్పుడు అదే టైటిల్‌తో వ‌స్తోన్న సినిమాలో ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక రేణు 2013లో వ‌న్స్ మోర్ సినిమాతో నిర్మాత‌గా మారి 2014లో ల‌వ్ ఇష్క్ వాలా సినిమాతో ద‌ర్శ‌కురాలిగా మారారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news