ఒకే ఒక్క సినిమాతో సౌత్‌లో సూపర్ పాపులర్ అయిన ఆ అమ్మడు ఇప్పుడు అమ్మ అవుతోంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాతో హీరోయిన్ అయిన ఆమె ఆ ఒక్క సినిమాతోనే కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత సౌత్ టు నార్త్ పలు భాషల్లో హీరోయిన్గా నటించింది. అయితే ఆమెకు వచ్చిన క్రేజ్‌తో పోలిస్తే ఆమెకు సరైన గుర్తింపు రాలేదు.
ఆ తర్వాత ఆమె కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్‌రెడ్డిని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసి దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఓ షాకింగ్ న్యూస్‌తో అందరిని సర్ఫ్రైజ్ చేసింది. త్వరలో తాను అమ్మ కాబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ట్విటర్లో విడుదల చేసిన వీడియోకు నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక తన భర్త రోహిత్ రెడ్డితో ఆమె ప్రేమ స్టిల్స్, వీడియోలు చూపిస్తూ అనిత ఫుల్ ఖుషీ అవుతున్నారు. రోహిత్‌రెడ్డితో ఏడడుగులు వేసిన మొదలుకుని ఇప్పటి వరకు తమాషాగా సాగిన ప్రేమ ప్రయాణాన్ని ఆ వీడియోలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.