రిచా ఈ పేరు చెప్పగానే చాలా మంది గుర్తు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ తరం జనరేషన్ కుర్రాళ్లకు రిచా తెలియదు. కాని ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లితే ఒకే ఒక్క సినిమాతో ఆమె క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన నువ్వే కావాలి సినిమాతో రిచా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమెకు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తరుణ్ – రిచా, సాయికిరణ్, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్టర్ కె.విజయ్‌భాస్కర్ లాంటి వాళ్లకు ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది.
ఈ సినిమాలో నటించిన తరుణ్ , రిచా మరోసారి చిరుజల్లు సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో పాటు పబ్లిక్‌లో ఆమె తిరగకపోవడంతో ఫేడవుట్ అయిపోయింది. ఆమె ఇతర భాషల్లో సినిమాలు చేసినా అవి కూడా ప్లాప్ అయ్యాయి. చివరకు హిందీలో ఆమెను ఓ సెకండ్ గ్రేడ్ హీరోయిన్గా మాత్రమే చూశారు. బెంగళూరులో పుట్టి పెరిగిన రిచా బాలీవుడ్లో కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహే సినిమాలో నటిస్తూ ఆ హీరోతో ఎఫైర్ పెట్టుకుందన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి.
చివరకు రిచా సినిమాలకు గుడ్ బై చెప్పి తన ప్రేమికుడిని పెళ్లాడి ఓ కొడుకును కూడా కంది. అయితే ఎప్పుడు అయినా ఫంక్షన్స్‌కు మాత్రమే వచ్చే రిచా తన భర్తతో పబ్లిక్‌గా ఎక్కువుగా కనిపించేందుకు ఇష్టపడదు. తన లైఫ్‌ను తాను ఓ పరిధిలో మాత్రమే ఎంజాజయ్ చేస్తోంది.