Gossipsబిగ్‌బాస్‌లో హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎవ‌రికంటే... ఆ టాప్ రేటు ఇదే..!

బిగ్‌బాస్‌లో హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎవ‌రికంటే… ఆ టాప్ రేటు ఇదే..!

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4 విజ‌య‌వంతంగా ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే హీరోయిన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గ‌జ్జ‌ర్‌పై తొలి రెండు వారాల్లో పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఇప్పుడిప్పుడే ఆమెకు విప‌రీత‌మైన క్రేజ్ వ‌స్తోంది. షోకు హైప్ క్రియేట్ కావ‌డం వెన‌క మోనాల్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆమె ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ కూడా అని చెప్పాలి.

Photo: Monal Gajjar looks radiant in yellow | Gujarati Movie News - Times  of India

అభిజిత్ మరోవైపు అఖిల్ తో ఆమె వ్యవహరించే తీరు షోలో ఒక ముక్కోణ‌పు ప్రేమ క‌థ హౌస్‌లో న‌డుస్తుంద‌న్న గుస‌గుస‌లు రావడం.. బ‌య‌ట చూసేవాళ్ల‌కు కూడా కావాల్సినంత వినోదం పండుతుండ‌డంతో మోనాల్‌కు ఇప్పుడు బ‌య‌ట ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు. ఓ విధంగా మోనాల్ వ‌ల్ల గొడ‌వ‌లు పెర‌గ‌డంతోనే అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య గొడ‌వ‌లు పెరిగి శ‌త్రువులు అయ్యారు. ఇక ఆమె కూడా గ్లామ‌ర్ ఆర‌బోసే విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు.

Monal Gajjar Quits VIP2! | NETTV4U

రోజుకో హాట్ లుక్‌లో మోనాల్ ద‌ర్శ‌న‌మిస్తోంది. ఇప్ప‌టికే షో స్టార్ట్ అయ్యి నెల రోజులు దాటేసింది. హౌస్‌లో అంద‌రికంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ మోనాల్‌దే అన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమెకు వారానికి రు. 8 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ర‌ట‌. అంటే రోజుకు రు. ల‌క్ష కంటే ఎక్కువ ఇస్తున్నారు. ఇక లాస్య‌, నోయ‌ల్‌కు వారానికి రు. 7 ల‌క్ష‌లు ఇస్తార‌ని టాక్‌. అలాగే అభిజిత్‌, అఖిల్‌కు రు. – 4 ల‌క్ష‌ల మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ ఉంటుందంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news