ఎన్టీఆర్ యమగోల సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమా వెనక చాలా సంచలనాలు దిగా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం వేయక మానదు. దర్శకుడు పుల్లయ్య ఎన్టీఆర్ తో దేవాంతకుడు సినిమా చేశాడు. ఎస్వీఆర్ యముడిగా చేశారు. ఆ తర్వాత యమగోల స్క్రిఫ్ట్‌పై కొంత వరకు వర్క్ చేశారు. కొంత పూర్తయ్యాక పక్కన పెట్టేశారు. ఆయన కుమారుడు సీఎస్ రావు తదితరులు కొందరు వర్క్ చేశారు. ఈ స్క్రిఫ్ట్‌ను నిర్మాత రామానాయుడు కొన్నారు. అయితే దీనిని డివి. నరసరాజు చూసి బాగోలేదని చెప్పడంతో ఆయన పక్కన పెట్టేశారు.
ఇదిలా ఉంటే కెమేరామెన్ వెంకటరత్నం శోభన్‌బాబుతో ఈతరం మనిషి అనే సినిమా చేయగా అది ప్లాప్ అవ్వడంతో రు. 12 లక్షలు నష్టం వచ్చింది. ఈ టైంలో వెంకటరత్నం రామానాయుడు దగ్గర ఉన్న మయగోల కథను రు. 5 వేలకు కొనగా దానిని నరసరాజు మంచి బాగా తీర్చిదిద్దారు. తాతినేని రామారావు దర్శకుడు. ఎన్టీఆర్ యముడిగా, బాలయ్య హీరోగా చేయాలనుకున్నారు. బాలయ్య స్టడీస్‌లో ఉండడంతో ఎన్టీఆర్ వద్దని.. ఆ సినిమా తానే చేస్తానని.. యముడిగా సత్యనారాయణను పెట్టమని ఆయనే సలహా ఇచ్చారు.
కేవలం 27 రోజులకే షూటింగ్ పూర్తయ్యింది. అప్పటికే అడవి రాముడు సూపర్ హిట్ అయ్యి ఆడుతోంది. దీంతో ఆ సినిమా 175 రోజులు అయ్యాకే యమగోల గోల రిలీజ్ చేయాలన్న కండీషన్‌పై లక్ష్మీఫిలింస్ వాళ్లు ఈ సినిమాను కొన్నారు. ఆగస్టులో సెన్సార్ పూర్తయ్యాక కూడా రెండు నెలల పాటు ఉన్నాక దసరాకు ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద ప్రభంజనం క్రియేట్ చేసింది. 40 చోట్ల రిలీజ్ అయిన ఈ సినిమా 28 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 90 రోజులకు రు. కోటి వసూలు చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
అడవిరాముడు వచ్చిన వెంటనే మరోసారి జయప్రద కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ఆడుతోన్న టైంలో రాష్ట్రంలో పెద్ద తుఫాన్లు వచ్చాయి. ఎన్టీఆర్ జోలె పట్టి విరాళాలు వసూలు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు.